Salman Khan : తన కోస్టార్ ను నిజంగా కత్తితో పొడిచిన సల్మాన్ ఖాన్

Salman khan

Salman Khan : బాలీవుడ్ సీనియర్ నటుడు అశోక్ సరాఫ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 1992లో జరిగిన భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘జాగృతి’ సినిమా సెట్స్‌లో ఒక సీరియస్ సీన్ చిత్రీకరణ సమయంలో తన ప్రాణాలకు ముప్పు వచ్చిన విషయాన్ని వెల్లడించారు.

ఆ సన్నివేశంలో సల్మాన్ ఖాన్ తన మెడపై నిజమైన కత్తిను పెట్టి యాక్షన్ సీన్‌లో పాల్గొన్నారని సరాఫ్ చెప్పారు. కానీ, ఆ కత్తి బలంగా పట్టుకోవడంతో తన గొంతుకు లోతైన గాయం అయిందని తెలిపారు. “నేను కత్తి నిజమైనదే అని సల్మాన్‌కి చెప్పినా, సీన్ ఇంపాక్ట్ కోసం ఆయన దాన్ని బలంగా నొక్కాడు. వెంటనే నా గొంతు కోసుకుపోయింది,” అని సరాఫ్ చెప్పారు. కెమెరా యాంగిల్ కారణంగా చిత్రబృందం కూడా ఆ సమయంలో ఏమీ గమనించలేదని అన్నారు.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఆ సంఘటనను తాను జీవితాంతం మర్చిపోలేనని సరాఫ్ అన్నారు. అయినప్పటికీ సల్మాన్ ఖాన్‌తో తన వృత్తిపరమైన సంబంధాలు దెబ్బతినలేదని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయనతో ‘కరణ్ అర్జున్’, ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాలలో నటించినట్లు పేర్కొన్నారు. “సల్మాన్ ఖాన్ ఈ సంఘటనను గుర్తుంచుకున్నాడో లేదో తెలియదు. కానీ అటువంటి వారు సాధారణంగా మరిచిపోతారు,” అని సరదాగా వ్యాఖ్యానించారు.