Baahubali : టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి సిరీస్ ప్రభాస్‌కి పాన్ ఇండియా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. రాజమౌళి దర్శకత్వం, రానా, అనుష్క, తమన్నా నటనతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాహుబలి-2 భారత సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాహుబలి టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. బాహుబలి-2లో దేవసేన సీమంతం సీన్ షూటింగ్ సమయంలో తీసిన बिहైండ్-ది-సీన్స్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రభాస్ సరదాగా అల్లరి చేస్తూ, రానా, అనుష్కలతో నవ్వులు పూయించే సంభాషణలు సాగిస్తున్నాడు. సెట్‌లో ఉన్న వారంతా ఆ సరదా మాటలతో పొట్ట చెక్కలవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm
— Baahubali (@BaahubaliMovie) August 3, 2025













