Nandamuri Balakrishna : మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి : బాలకృష్ణ

Balakrishna
Nandamuri Balakrishna : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ, “చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. 130 రోజుల్లోనే వివిధ దేశాలలో ఈ చిత్రాన్ని అద్భుతంగా పూర్తి చేసాం. ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మ పరాక్రమం చూపించాం. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. మా నాన్న గారు నా గురువు, ఆయన బాటలోనే నేను నడుస్తున్నాను.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో ‘అఖండ’ చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. బోయపాటి, మాది హిట్ కాంబినేషన్. సింహ, లెజెండ్, అఖండ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం నా తల్లితండ్రులు, అభిమానుల ఆశీస్సులని భావిస్తున్నాను. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది. డిసెంబర్ 5 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా” అని పేర్కొన్నారు.