Kishkinda Puri : మళ్లీ భయపడుతానంటున్న ‘రాక్షసుడు’ హీరో

Kishkinda puri

 

Kishkinda Puri : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫోరం లో కొనసాగుతున్నాడు. త్వరలోనే హారర్ థ్రిల్లర్ జానర్‌లోని ‘కిష్కిందపురి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని ‘చావు కబురు చల్లగా’ చిత్రం డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి దర్శకుడు గా రూపొందిస్తున్నారు. షైన్ స్క్రీన్, అర్చన ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read :  భయానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి వస్తోంది ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్!

ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా పూర్తవుతోంది. ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లు, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో నిండిన ‘కిష్కిందపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదనంగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ లుక్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు.