Emraan Hashmi: ‘ఓమి’ క్యారెక్టర్‌ ఎప్పటికీ స్పెషల్‌.. ‘OG’పై ఇమ్రాన్‌ హాష్మీ బిగ్‌ రియాక్షన్‌!

Emraan Hashmi

Emraan Hashmi: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘OG’తో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హాష్మీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌ ‘ఓమి’ పాత్రలో కనిపించిన ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘OG’ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సౌత్‌ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమాలో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని ఇమ్రాన్‌ హాష్మీ తెలిపారు. అయితే ‘OG’ కథ విన్న వెంటనే తన అభిప్రాయం మారిపోయిందని చెప్పారు. దర్శకుడు సుజీత్‌ కథను తెరకెక్కించిన విధానం, ఆయన విజన్‌ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

‘OG’ స్క్రిప్ట్‌ నాకు మొదటినుంచే బాగా నచ్చింది. సుజీత్‌ వెండితెరపై చూపించిన మ్యాడ్‌నెస్‌, ఆయన విజన్‌ అద్భుతంగా అనిపించింది. పాత్రలను లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ స్టైల్‌లో డిజైన్‌ చేసి ప్రజెంట్‌ చేసే విధానం నాకు చాలా నచ్చింది’’ అని ఇమ్రాన్‌ హాష్మీ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తన తొలి ప్రాజెక్ట్‌గా ‘ఓమి’ పాత్రను చేయడం చాలా ప్రత్యేకమైన అనుభవమని ఆయన వెల్లడించారు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ‘OG’లో భాగం కావడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘OG’లో ఇమ్రాన్‌ హాష్మీతో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.