
G2 Movie : యంగ్ హీరో అడివి శేష్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘గూఢచారి’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘G2’ రాబోతుంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 6 దేశాల్లో, 23 సెట్లపై 150 రోజుల పాటు జరిపిన భారీ షెడ్యూల్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమా అడవి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది. “ఇప్పటి వరకు నేను నిశ్శబ్దంగా ఉన్నాను, కానీ ఇది ఒక ఎక్స్‌ప్లోసివ్ థ్రిల్లర్. మేడే రోజు థియేటర్‌లో కలుద్దాం” అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు.
గూఢచారి ఫ్రాంచైజీలో Agent 116గా వామికా గబ్బి చేరారు. ఆమె పాత్రలో భావోద్వేగం, ధైర్యం రెండూ కలగలిపి ఉంటాయి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలినిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినయ్ కుమార్ శ్రీగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై TG విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. గతంలో భారతదేశంలో సాగిన గూఢచారి కథ, ఈసారి అంతర్జాతీయ స్థాయికి వెళ్లనుంది. శక్తివంతమైన తారాగణం, గ్లోబల్ స్థాయి నిర్మాణ విలువలు, అంబిషియస్ విజన్‌తో రూపొందుతోన్న G2, 2026 సంవత్సరంలో విడుదలవుతున్న ప్రధానమైన యాక్షన్ థ్రిల్లర్‌గా నిలవనుంది.
I was silent until now.
Because we have been building something EXPLOSIVE.
Shooting in six countries. 23 sets. 150 days. Releasing in 5 languages.
My BIGGEST.
Exploding worldwide
MAY DAY !May 1, 2026
In Theaters. pic.twitter.com/Eyb8vbY0BG— Adivi Sesh (@AdiviSesh) August 4, 2025












