Godari Gattupaina : వాలెంటైన్స్ డే రోజునే బ్రేకప్ సాంగ్ రిలీజ్.. ఇదేం ట్విస్ట్!

Godari gattupaina
Godari Gattupaina : ‘మేమ్ ఫేమస్’తో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ అనే రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుభాష్ చంద్ర రూపొందించగా, Red Puppet Productions నిర్మిస్తోంది. హీరోయిన్‌గా నిధి ప్రదీప్ నటిస్తుండగా, కీలక పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘చూడు చూడు’ పాట సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించాయి. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా బ్రేకప్ సెలబ్రేషన్ సాంగ్ అంటూ విడుదలైన ‘ఓ మై గాడ్’ సాంగ్ కూడా యువతను బాగా ఆకట్టుకుంటోంది.

Also Read :  Khushbu Sundar: సీఎం విజయ్‌ను కలిసిన కుష్బూ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?

ఈ పాటను సంగీత దర్శకుడు నాగ వంశీ కృష్ణ ఫన్ బీట్‌లలో హార్ట్‌బ్రేక్ ఎమోషన్‌ను కలిపి, బ్రేకప్ బాధను కూడా సెలబ్రేషన్‌లా మార్చే విధంగా స్వరపరిచారు. లిరిసిస్ట్ వెంగి రాసిన చమత్కారమైన లిరిక్స్‌కు, గానా బాల పవర్‌ఫుల్ వాయిస్ మరింత జోష్ ఇచ్చింది. కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి ఫాస్ట్, కలర్‌ఫుల్ స్టెప్స్‌తో వైల్డ్ వైబ్ తీసుకొచ్చారు. సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తూ, లవ్ ఫెయిల్యూర్‌ను కూడా స్టైల్‌గా హ్యాండిల్ చేయొచ్చని చూపించారు.

Also Read :  Janhvi Kapoor: బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్.. చరణ్ ఒక ‘జెమ్’.. జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్!