Haiku: ‘హైకూ’ షూటింగ్ కంప్లీట్ .. పోస్ట్ ప్రొడక్షన్ షురూ!

Adhika masa purnima

Haiku: ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన హీరోయిన్ శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ బహుభాషా చిత్రం ‘హైకూ’. ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగియడంతో, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు.

Also Read :  Trisha: విజయ్ బర్త్‌డే వేడుకల్లో త్రిష.. కేక్ కటింగ్ ఫోటోతో ఆ పుకార్లకు చెక్!

ఈ సందర్భంగా డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ.. “అనుకున్న ప్లానింగ్ ప్రకారం ‘హైకూ’ సినిమాను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఇచ్చిన సపోర్ట్‌తో మేం ఊహించిన దానికంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్‌లతో టెక్నీషియన్స్ అందించిన సహకారంతో ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చేలా తెరకెక్కించాం” అని అన్నారు. నిర్మాతలు డా.డి.అరుళానందు, మాథేవో అరుళానందు మాట్లాడుతూ.. “సినిమా అవుట్‌పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం. డైరెక్టర్‌కు కథపై ఉన్న స్పష్టత, మేకింగ్‌లో చూపించిన క్రమశిక్షణే దీనికి కారణం. సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు కంటెంట్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాయి. అయినప్పటికీ, ‘హైకూ’ సినిమా కథా బలం, యూనివర్సల్ అప్పీల్‌ను నమ్మి.. షూటింగ్ పూర్తి కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.