HHVM : వీఎఫ్ఎక్స్ విమర్శలతో వీరమల్లు ఎడిట్.. 20 నిమిషాల సీన్లు తొలగింపు!

Hhvm review
HHVM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన‌ భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత సెకండ్ హాఫ్‌లోని కొన్ని సీన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ క్వాలిటీ పట్ల ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో మూవీ టీమ్ తక్షణమే స్పందించింది. సెకండ్ హాఫ్‌లో ఉన్న హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం దొంగలించే సీన్లలో కొన్ని వీఎఫ్ఎక్స్ వీక్‌గా ఉన్నాయని భావించి, మొత్తం 20 నిమిషాల సీన్లను కట్ చేశారు. ముందుగా 2 గంటల 42 నిమిషాలున్న నిడివి ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకు తగ్గింది. ఈ సీన్ల తొలగింపు వల్ల కథలో లింక్ కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని టీమ్ చెబుతోంది. కొత్త వెర్షన్ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఈ చర్యతో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతున్నారని మూవీ టీమ్ పేర్కొంటోంది. రిలీజ్ రోజు నుంచే వీరమల్లు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రీమియర్స్ ద్వారా భారీ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తన స్థాయికి మించి చేసిన ప్రమోషన్లు, సక్సెస్ మీట్ వంటి చర్యలు హైప్‌ను పెంచినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.