
Hari Hara Veera Mallu Trailer : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను జూలై 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించిన వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు.
ఇది కేవలం సినిమా ట్రైలర్ కాదు, ఒక గ్రాండ్ విజువల్ అనుభవంలా కనిపించింది. పవన్ కళ్యాణ్ విభిన్న గెటప్పులతో, మునుపెన్నడూ చూడనంత శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెరిశారు. యాక్షన్ సన్నివేశాలు, రాజమహల్ సెట్స్, యుద్ధ భూముల విజువల్స్ ట్రైలర్‌కు మహత్తరమైన స్థాయి ఇచ్చాయి. ట్రైలర్‌ను చూసినవారు ఇందులో యాక్షన్, ఎమోషన్స్, గ్రాఫిక్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.
ఎం.ఎం. కీరవాణి సంగీతం, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చాయి. ముఖ్యంగా చివరి 30 సెకన్లు గూస్‌బంప్స్ రేపేలా వున్నాయట. ఈ ఏడాది అత్యంత పవర్‌ఫుల్ ట్రైలర్ మూమెంట్స్‌గా గుర్తింపు పొందనుందట. టెక్నికల్ పనితీరు అద్భుతంగా ఉంది – 140 పర్ఫెక్ట్ ఎడిటెడ్ షాట్స్, ఎలివేటెడ్ రైటింగ్, గుర్తుండిపోయే డైలాగ్స్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా రాసిన డైలాగ్స్ సినిమాకే కాదు, ఆయన ఆలోచనా శక్తికి ప్రతిరూపంగా నిలిచాయట. బాబీ డియోల్ కూడా పవన్‌కు సమానంగా స్క్రీన్ మీద ప్రభావాన్ని చూపించడంతో, వీరిద్దరి మధ్య సన్నివేశాలు కథలో గొప్ప లేయర్స్ ఉన్నాయని సూచిస్తున్నాయి. టెక్నికల్‌గా ట్రైలర్ చాలా రిచ్‌గా ఉండటం, ఎడిటింగ్, రైటింగ్, డైలాగ్స్ అన్నీ అద్భుతంగా మిళితమై సినిమా మీద హైప్‌ను భారీగా పెంచేశాయి.












