Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ క్రేజీ అప్‌డేట్.. ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్!

Dragon

Dragon: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన ‘యాక్షన్ బ్లాక్స్’ షూటింగ్‌ను పూర్తి చేయడానికి మేకర్స్ కేవలం 45 రోజుల పక్కా షెడ్యూల్‌ను లాక్ చేసినట్లు సమాచారం.

ఈ 45 రోజుల సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్‌లో సినిమాలోనే అత్యంత కీలకమైన, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఈ స్పెషల్ ఫైట్ సీన్‌ను ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూపించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. దీని కోసం చిత్రయూనిట్ శ్రీలంకలోని కొన్ని అందమైన, విభిన్నమైన లొకేషన్లతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరపనుందట. శ్రీలంక, ఆర్‌ఎఫ్‌సీల కలయికలో సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఫీస్ట్‌ను అందించనుందని టాక్. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ‘సలార్’, ‘కేజీఎఫ్’ చిత్రాలను మించేలా ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను మేకర్స్ డిజైన్ చేశారట. హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ ఈ ఫైట్స్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్యాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే ఈ శ్రీలంక షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.