
KA Movie : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ సినిమా మరో గొప్ప గౌరవాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా జరిగే 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికై అవార్డును సాధించింది. ఓ తెలుగు చిత్రానికి అంత పెద్ద గౌరవం దక్కడంతో అభిమానులు సోషల్ మీడియాలో చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు.
సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పీరియాడికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుజిత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించారు. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదలైన ‘క’ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించగా, శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పించారు.











