Korean Kanakaraju: కొరియన్ కనకరాజుకు భారీ బిజినెస్.. ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ రైట్స్‌పై భారీ అంచనాలు!

Korean Kanakaraju teaser

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొనగా, తాజాగా ఓటీటీ, థియేట్రికల్ రైట్స్‌కి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ ఓటీటీ రైట్స్ సుమారు రూ.15 కోట్లకు ఫైనల్ అయినట్లు టాక్. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ డీల్ నిర్మాతలకు మంచి ఊరటనిచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు థియేట్రికల్ బిజినెస్‌ను కూడా మేకర్స్ భారీ స్థాయిలో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఆంధ్ర ప్రాంత థియేటర్ రైట్స్ ద్వారా రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు, సీడెడ్ నుంచి సుమారు రూ.1.5 కోట్ల వరకు, నైజాం రైట్స్ ద్వారా రూ.4 కోట్ల వరకు రాబట్టాలని నిర్మాతలు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్, పాటలకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ టార్గెట్ చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించడంతో సినిమా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.