Sathi Leelavathi : లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్.. నవ్వులు పూయించే పెళ్లి డ్రామా!

Sathileelavathi
Sathi Leelavathi Teaser : లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకుడు. నాగమోహన్ నిర్మాణంలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ సమర్పిస్తోంది. భార్యాభర్తల మధ్య భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన ఫన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా మేకర్స్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

Also Read :  Ilaiyaraaja: ఇళయరాజా బర్త్‌డే స్పెషల్.. ఈ లెజెండ్ ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే!

టీజర్‌లో లావణ్య, దేవ్ మోహన్ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మొదట ప్రేమగా ఉండే ఈ జంట మధ్య అనూహ్యంగా తలెత్తే గొడవలు, వినోదభరితంగా మలచబడ్డ దృశ్యాలు టీజర్‌ను హైలైట్ చేశాయి. అలాగే భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందుకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.

Also Read :  Anil Ravipudi: వెంకటేష్ - కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. జూన్ 22 నుంచి ఊచకోత షురూ!

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సతీ లీలావతి’ను త్వరలోనే విడుదల చేయాలన్న దిశగా చిత్ర బృందం కసరత్తులు జరుపుతోంది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ ఈ చిత్రానికి టెక్నికల్‌గా బలాన్ని చేకూర్చనున్నాయి. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.