Maa Inti Bangaram : సెన్సార్ పూర్తి.. హైలైట్ గా సమంత పెర్ఫార్మెన్స్ !

Ma inti bangaram censor
సమంత ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా చూసిన సెన్సార్ వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలో సమంత నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.