
‘పెద్దరాయుడు’ సినిమాలో “నేను చూసాను తాతయ్య” అనే ఒక్క డైలాగ్‌తోనే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన బాల నటుడు మాస్టర్ మహేంద్రన్, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో యంగ్ విజయ్ సేతుపతిగా అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఇప్పుడు మహేంద్రన్ పూర్తిస్థాయి హీరోగా ‘నీలకంఠ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించగా, స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టీజర్‌లో శ్రవణ్ అందించిన డీవోపీ, ప్రశాంత్ బిజె సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను నైజాంలో గ్లోబల్ సినిమాల్ విడుదల చేయనుంది.









