Mahesh Babu: మహేశ్ బాబు – బుచ్చిబాబు కాంబోకు అసలు ఛాన్స్ లేదు! సూపర్ స్టార్ నెక్ట్స్ మూవీ ఆల్రెడీ ఫిక్స్?

Mahesh Babu Buchi Babu (2)

Mahesh Babu: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ క్రేజీ కాంబినేషన్ గురించైనా వార్త వస్తే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పెద్ది ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిసిమా తర్వా మహేశ్ బాబు లైనప్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read :  SSMB30: బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్.. బుచ్చిబాబుతో - మహేష్ బాబు సినిమా? 'SSMB30'పై క్రేజీ లీక్!

అయితే సూపర్ స్టార్‌తో బుచ్చిబాబు సినిమా వార్తలను పక్కన పెడితే, మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఆల్రెడీ లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ (Asian Cinemas) బ్యానర్‌లో తెరకెక్కడం దాదాపు ఖరారైందట. బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా పెద్ది అనే సినిమాతో సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనులపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మహేశ్ బాబు ప్రాజెక్ట్ ఏషియన్ సినిమాస్‌తో ఫిక్స్ కావడంతో.. బుచ్చిబాబు – మహేష్ బాబు కాంబినేషన్ కేవలం పుకార్లకే పరిమితం అయ్యిందనే ప్రచారం కూడా జోరందుకుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా ఏషియన్ సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నాడు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మహేష్ బాబు నెక్ట్స్ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది.