Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా ఇంట్లో ఆనందం నెలకొంది. ఆయన జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. మహేశ్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. భార్య శ్రావణి రెడ్డి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని మహేశ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన బిడ్డ ఫోటోలు షేర్ చేస్తూ “ఇది నా జీవితంలోనే అత్యంత ఆనందమైన క్షణం” అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు కాసేపట్లోనే వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
యూట్యూబ్ వీడియోలతో తన ప్రయాణం ప్రారంభించిన మహేశ్, తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆ షో వేదికపైనే తన ప్రేమ కథను బయటపెట్టారు. శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రకటించి, అదే ఏడాది ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ జంట ఎప్పటికప్పుడు తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రావణి గర్భవతి అని వెల్లడించగా, గత నెల శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు చిన్నారి పుట్టడంతో మహేశ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. సినిమాల విషయానికొస్తే, మహేశ్ విట్టా ‘జాంబిరెడ్డి’, ‘కొండపొలం’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, వెబ్ సిరీస్‌లు చేస్తూ, దర్శకుడిగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.













