Meesaala Pilla : మెగాస్టార్ ‘మీసాల పిల్లా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది!!

Msg
Meesaala Pilla Full Song : అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రం నుండి దసరా సందర్భంగా విడుదలైన ‘మీసాల పిల్లా’ సాంగ్ ప్రోమోకి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. చాలాకాలం తర్వాత చిరంజీవి–ఉదిత్ నారాయణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాటపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రోమోలోనే చిరంజీవి స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ స్టెప్స్, ఉదిత్ నారాయణ్ గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఫుల్ సాంగ్‌లో భాస్కర భట్ల రాసిన “రాజీ పడదామంటే రావేం మాజీ ఇల్లాలా”, “నువ్వు రోజూ పెట్టే నరకంలోకి మళ్లీ దూకాలా” వంటి లిరిక్స్ వింటుంటే భార్యాభర్తల మధ్య సరదాగే సాగే కీచులాటలను చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

భీమ్స్ సెసిరోలియో అందించిన చక్కని సంగీతం, మాస్టర్ విజయ్ పొలాకీ కొరియోగ్రఫీ, చిరంజీవి డాన్స్ గ్రేస్ ఇవన్నీ కలసి పాటను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చాయి. నయనతార తన స్టైలిష్ లుక్, చక్కని స్టెప్పులతో చిరుకు సరైన జోడీగా మెరిసింది. మొత్తానికి ‘మీసాల పిల్లా’ ఫుల్ లిరికల్ సాంగ్ చిరు అభిమానులతో పాటు, ప్రేక్షకులందరికీ మ్యూజికల్ ట్రీట్‌ను అందించింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో సాహు గారపాటి, సుశ్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్