Nani: రౌడీ హీరో, సూర్యలకు నాని బంపర్ గిఫ్ట్! ఎలాగో తెలుసా?

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని లైనప్‌లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్న నాని.. తన ‘#TheParadise’ షూటింగ్‌లో తలెత్తిన ఊహించని ఆలస్యం కారణంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట. ఈ మేజర్ చేంజ్‌కు సంబంధించిన అప్‌డేట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. నానితో సినిమాలు చేయాల్సిన ఇద్దరు దర్శకులు ఇప్పుడు వేరే హీరోలతో ముందుకు వెళ్తున్నారు. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్ అందించిన డైరెక్టర్ శౌర్యువ్ నానితో మరో సినిమా చేయాల్సిందట. కానీ తాజా పరిణామాలతో ఆయన రూట్ మార్చి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు షిఫ్ట్ అయ్యారు.

అలాగే ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ సైతం నాని ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడంతో.. హోంబాలే ఫిల్మ్స్ నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. రెండు భారీ కొల్లాబరేషన్లు చేజారినప్పటికీ నాచురల్ స్టార్ నాని మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తన పూర్తి ఫోకస్‌ను ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపైనే పెట్టారని సమాచారం. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయడంతో పాటు, తన నెక్ట్స్ చిత్రం ‘#BloodyRomeo’ పైనే నాని కంప్లీట్‌గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.