
Nani : టాలీవుడ్లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో బ్యాక్-టు-హిట్స్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన కథకు నాని ఇంప్రెస్ అయినట్లు సమాచారం. వెంకీ అట్లూరి వినిపించిన ఫైనల్ నరేషన్ నచ్చడంతో నాని ఈ సినిమాకు ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతం నాని డేట్స్, ఆయన కమిట్మెంట్స్పైనే ఆధారపడి ఉందని అంటున్నారు. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దీని తర్వాత నాని డైరెక్టర్ సుజీత్ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే వెంకీ అట్లూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.














