#NBK111 OTT రైట్స్‌కు అదిరిపోయే డీల్..?

NBK111

#NBK111 OTT: గోపించంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం #NBK111. తాజాగా ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ విషయంలో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5తో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ డీల్ దాదాపు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం #NBK111 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జీ5 సంస్థ సుమారు రూ.50 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ అధికారికంగా ఖరారైతే, బాలయ్య కెరీర్‌లో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి కాలంలో థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ మొత్తాలకు ఓటీటీ రైట్స్ అమ్ముడవుతున్న నేపథ్యంలో, #NBK111 కూడా అదే జాబితాలో చేరే అవకాశముందని భావిస్తున్నారు. బాలకృష్ణ మార్కెట్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య పెరుగుతున్న పోటీ వంటి అంశాలే ఈ స్థాయి ఆఫర్‌కు కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ గానీ, జీ5 గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.