Nidhhi Agerwal : జూలైలో వీరమల్లు, డిసెంబర్‌లో రాజాసాబ్.. నిధి క్రేజ్ మామూలుగా లేదుగా!

Nidhhiagerwal
Nidhhiagerwal

Nidhhi Agerwal : యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో “హరి హర వీరమల్లు”, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్‌తో “రాజా సాబ్” వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ, ఇండస్ట్రీలో తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అందం, నటనా నైపుణ్యం.. ఇవన్నీ కలిసి ఆమెను ఫ్యాన్స్ ఫేవరెట్‌గా మార్చేశాయి.

Also Read :  Nidhhi Agerwal: వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు: నిధి అగర్వాల్ బోల్డ్ రియాక్షన్

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన హరి హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ హంగామా స్పష్టంగా కనిపించింది. ఆమె స్టేజ్ మీదకు వచ్చిందంటే చాలు.. అభిమానులు నిధి పేరుతో నినాదాలు చేస్తూ మారుమోగించారు. ఈ సినిమాలో పంచమి పాత్రలో నిధి అగర్వాల్ కనిపించబోతోంది. ఇక ఈ మూవీ జూలై 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా, ఆమె ప్రభాస్‌తో నటించిన రాజా సాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. రెండు సినిమాలూ ఆమె కెరీర్‌లో మైలురాయిలుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.