Coolie: ఆగస్ట్ 2న రజనీకాంత్ ‘కూలీ’ ట్రైలర్

Coolie
Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘కూలీ’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఆయన క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది.

ఇటీవలే ‘కుబేర’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ‘కూలీ’లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

మేకర్స్ తాజాగా ఒక బిగ్ అప్డేట్‌ను ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కూలీ’ ట్రైలర్‌ను ఆగస్ట్ 2న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పవర్‌ఫుల్ లుక్స్‌తో కనిపించిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, యాజమాన్యం డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఆధ్వర్యంలో, ‘కూలీ’ మూవీ తెలుగు హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై హైప్ పెంచాయి. ‘చికిటు’, ‘మోనికా’ పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.

ఈ చిత్రానికి ఆనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య, 2025 ఆగస్ట్ 14న ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.