Ram Charan Devalayam: గుడి కట్టే రేంజ్‌లో రామ్ చరణ్ క్రేజ్.. కూకట్‌పల్లిలో మెగా అభిమానుల అరాచకం.. ఏం జరిగిందంటే?

Ram Charan

Ram Charan Devalayam: తమ అభిమాన హీరోపై ఉన్న భక్తిని చాటుకోవడంలో మెగా ఫ్యాన్స్ మరోసారి నెక్స్ట్ లెవెల్ డెడికేషన్‌ను చూపించారు. రేపు ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వేదికగా చరణ్ అభిమానులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కూకట్‌పల్లిలోని ప్రముఖ అర్జున్ థియేటర్ ప్రాంగణంలో రామ్ చరణ్ అభిమానులు ఏకంగా ఆయనకు గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఊర మాస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే క్యారెక్టరైజేషన్‌ను పోలి ఉండేలా అభిమానులు థియేటర్ వద్ద ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతటితో ఆగకుండా, ఆ విగ్రహం ఉన్న ప్రాంతానికి ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’ అని బోర్డు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. పెద్ది బొమ్మ థియేటర్‌లో పడడానికి ముందే కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ వద్ద వాతావరణం మెగా జాతరను తలపిస్తోంది. మెగా అభిమానులు భారీగా తరలివచ్చి చరణ్ విగ్రహానికి క్యూ కట్టి మరీ క్షీరాభిషేకాలు (పాలాభిషేకాలు) చేస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.