The Girlfriend : రష్మిక కొత్త సాంగ్ ‘లాయి లాయి లే’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న మెలోడీ!

Thegirlfriend
The Girlfriend : నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈ రోజు ఈ సినిమా నుంచి ‘లాయి లాయి లాయిలే’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, కపిల్ కపిలన్ పాడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారు. పాట ఎలా ఉందో చూస్తే.. ‘కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో, సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో, ఓ నీలి మేఘం, పెంచింది వేగం, ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి, కమ్మితే మైకం, లాయి లాయి లాయిలే..’ అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. మెమొరబుల్ లవ్ సాంగ్ గా ‘లాయి లాయిలే’ లవర్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కు గుర్తుండిపోనుంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం