RT76 : అన్నపూర్ణ స్టూడియోస్‌లో మాస్ బీట్‌తో స్టెప్స్ వేస్తున్న రవితేజ!

Rt76
RT76 : మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం #RT76 బిగ్ స్కేల్‌లో రూపుదిద్దుకుంటోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం SLV సినిమాస్ బ్యానర్‌పై స్టైలిష్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై ఒక స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్‌ను రూపొందించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మాస్ బీట్‌తో కూడిన ఈ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ప్రేక్షకులను ఎప్పటికప్పుడు తన మాస్ ఎనర్జీతో అలరించే రవితేజ, ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో కనిపించనున్నారు. హ్యూమర్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. భావోద్వేగ కథలను చక్కగా చెప్పడంలో ప్రత్యేకత కలిగిన కిశోర్ తిరుమల, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం భీమ్స్ సెసిరోలియో, సినిమాటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్షన్ ఏ.ఎస్. ప్రకాష్ నిర్వహిస్తున్నారు.