Raviteja : రవితేజ న్యూ మూవీ – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్లింప్స్‌ రిలీజ్!

Bmw
Raviteja : మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘#RT76’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. రవితేజ సరసన అశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. గ్లింప్స్‌ కూడా రిలీజ్ చేసారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

గ్లింప్స్‌లో కిశోర్ తిరుమల వాయిస్ ఓవర్‌లో రవితేజ జీవితంలోని ఇద్దరు మహిళలు అడిగిన ప్రశ్నలతో అతడు ఎలా గందరగోళానికి లోనయ్యాడో సరదాగా చూపించారు. ఏఐ, ఆధునిక సాంకేతికతలతోనూ సమస్యకు పరిష్కారం దొరకలేదని చెబుతూ చివరగా తనను ‘రామ సత్యనారాయణ’గా పరిచయం చేసుకుంటూ టైటిల్‌ను బయటపెడతాడు రవితేజ. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌లో రవితేజ కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురళ, ఎడిటింగ్ నేషనల్ అవార్డ్‌ విజేత శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ ఏఎస్ ప్రకాశ్ నిర్వహిస్తున్నారు. కుటుంబ విలువలతో కూడిన వినోదభరితమైన ఈ చిత్రం సంక్రాంతి 2026 నాటికి విడుదల కానుంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్