Ruhani Sharma: ‘ఆగ్రా’ వివాదం పై స్పందన.. ప్రకృతి ఒడిలో ప్రశాంతత వెతుక్కున్న నటి

Ruhani

Ruhani Sharma:  ‘ఆగ్రా’ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచిన నటి రూహానీ శర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాయిగానూ, శాంతిగా ఉండే ఫోటోను పంచుకున్నారు. ప్రకృతి మధ్య సేదతీర్చుకుంటూ నవ్వుతున్న ఈ ఫోటోలో ఆమె ఆకర్షణీయమైన గ్రీన్ స్కర్ట్‌, ప్రత్యేకమైన టాప్‌తో కనిపించింది. స్టైలిష్ సన్‌గ్లాసెస్, గోల్డ్ జ్యువెలరీతో లుక్‌ను కంప్లీట్ చేసింది. ఆమె క్యాప్షన్ కూడా అంతే అర్థవంతంగా ఉంది – “Where the world slows down and the soul breathe.” అని రాసింది.

ఇక ఇటీవలి కాలంలో రూహానీ శర్మ మరో కారణంతోనూ చర్చకు వచ్చారు. ఆగ్రా సినిమాలో ఆమెపై చిత్రీకరించిన వ్యక్తిగత సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రూహానీ ఓ ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  Arya 40: ‘బేబీ’ హీరోయిన్‌తో ఆర్య రచ్చ.. బోట్లపై ఆర్య 40 టీమ్ క్రేజీ సెలబ్రేషన్స్!

అలాంటి సన్నివేశాలను లీక్‌ చేయడం సినిమాపై పెట్టిన శ్రమను, కళాత్మకతను అవమానించడమేనన్నారు. ఇది మానసికంగా బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. “ఆర్ట్ అనేది ఎప్పుడూ సులభంగా అర్థమయ్యేలా ఉండదు. అది ప్రశ్నించాల్సిన, భావోద్వేగాన్ని కలిగించాల్సిన ఉద్దేశంతో ఉండాలి” అని ఆమె స్పష్టం చేశారు.

Also Read :  Nidhhi Agerwal: వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు: నిధి అగర్వాల్ బోల్డ్ రియాక్షన్

2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఆగ్రా సినిమా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అయితే, కొన్ని సన్నివేశాలపై వచ్చిన ట్రోలింగ్‌ను రూహానీ ధైర్యంగా ఎదుర్కొన్నారు.

తన పాత్రల పట్ల గౌరవం చూపాలని, సినిమాను ఒక కళారూపంగా చూడాలని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించి గౌరవించాలని అభిమానులను కోరారు. సినిమా అనేది వివిధ కోణాల్లో, వివిధ భావాలతో మన ముందుకు వస్తుంది. దానిలోని వైవిధ్యాన్ని గుర్తించి అందరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని రూహానీ హితవు పలికారు.