రామ్ #RAPO23 లోకి ‘ఖైదీ’ ఫేమ్ సామ్ సి.ఎస్ ఎంట్రీ! మ్యూజికల్ పూనకాలు గ్యారెంటీ!

Ram Pothineni

#RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23. ఈ చిత్రానికి రామ్ స్వయంగా కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇండస్ట్రీని షేక్ చేసే ఒక మ్యూజికల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మోస్ట్ వాంటెడ్ అండ్ పాపులర్ కంపోజర్ సామ్ సి.ఎస్ (Sam CS) మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ‘ఖైదీ’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలకు తన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన సామ్ సి.ఎస్, ఇప్పుడు #RAPO23 కోసం సరికొత్త సౌండ్ ట్రాక్‌ను రెడీ చేయబోతున్నారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. సామ్ సి.ఎస్‌తో రామ్ పోతినేని కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. “ప్రతి ప్రపంచానికి ఒక శబ్దం ఉంటుంది.. కానీ ఈ ప్రపంచం కేవలం విధ్వంసాన్ని మాత్రమే శ్వాసిస్తుంది” అంటూ ఒక పవర్‌ఫుల్ ట్యాగ్‌ను ఆ ఫోటోకి జోడించింది. సామ్ సి.ఎస్ ఎంట్రీతో ఈ సినిమా స్కేల్, మ్యూజికల్ హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుందని రామ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే ఒక పవర్‌ఫుల్ లోన్ ఉల్ఫ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ తిరు సినిమాటోగ్రాఫర్‌గా, పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాపై సామ్ సి.ఎస్ రాకతో అంచనాలు మరింత ఆకాశాన్ని తాకాయి.