Maa Inti Bangaaram Sequel: ‘మా ఇంటి బంగారం 2’ ఫిక్స్.. కానీ!

Maa Inti Bangaaram

Maa Inti Bangaaram Sequel: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘పార్ట్ 2’ల ట్రెండ్ నడుస్తోంది. ఏ చిన్న సినిమా హిట్ అయినా, పెద్ద సినిమా బ్లాక్‌బస్టర్ అయినా వెంటనే సీక్వెల్స్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అనౌన్స్ అవుతున్న సీక్వెల్స్ అన్నీ ‘పాన్ ఇండియా’ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంటే.. ఇప్పుడు వీటికి భిన్నంగా మరో క్రేజీ సినిమాకు పార్ట్ 2 ఖరారైంది. అదే ‘మా ఇంటి బంగారం 2’ (Maa Inti Bangaaram 2).

Also Read :  Kriti Sanon: ఆ సినిమా లెస్బియన్‌ లవ్‌స్టోరీ కాదు.. రూమర్స్‌పై కృతి సనన్ క్లారిటీ!

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫీషియల్‌గా ఈ సినిమా సీక్వెల్‌ను స్వయంగా సమంత భర్త, నిర్మాత రాజ్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి సీక్వెల్‌ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుంటే.. ఈ చిత్రం మాత్రం ఆ హడావుడి లేకుండా, కేవలం మన నేటివిటీకి తగ్గట్టుగా, ఒరిజినల్ కంటెంట్‌ను నమ్ముకుని తెలుగు ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా తెరకెక్కబోతోందట.

Also Read :  Sardar 2: ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో ఏజెంట్ ‘సర్దార్’ విధ్వంసం ఆ రోజే!

రూటెడ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ ‘మా ఇంటి బంగారం 2’కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత తల్లి కాబోతుండటంతో మరో రెండేళ్ల తర్వాత ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నాయని అఫీషియల్‌గా రాజ్ అనౌన్స్ చేశారు. తాజా ప్రకటనతో సామ్ ఫాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.