Sanjay Dutt : తన మహిళ ఫ్యాన్ కుటుంబానికి రూ.72 కోట్ల ఆస్తి ఇచ్చిన సంజు భాయ్

 

Sanjay dutt

Sanjay Dutt : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన ఉదారతను మరోసారి చూపించారు. తనకు ఓ అభిమాని బహుమతిగా ఇచ్చిన రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని ఆయన తిరిగి ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సంఘటన దాదాపు ఏడేళ్ల క్రితమే జరిగింది అని చెప్పారు.

Also Read :  Sandeep Reddy Vanga: బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ జాతర.. థియేటర్‌లో సినిమా చూసి సందీప్ రెడ్డి వంగా సంచలన రియాక్షన్!

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిషా పటేల్ అనే అభిమాని అప్పట్లో తన మొత్తం ఎస్టేట్‌ను సంజయ్ దత్ పేరుపై రిజిస్టర్ చేశారు. మరణానంతరం తన సంపద మొత్తం సంజయ్ దత్‌కే దక్కేలా వీలునామా కూడా రాశారని సమాచారం. అంతేకాకుండా బ్యాంకులకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Also Read :  Chiranjeevi: ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ విజయంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్.. ఒక తండ్రిగా, నటుడిగా గర్వపడుతున్నానంటూ కామెంట్స్!

ఈ విషయం గురించి సంజయ్ దత్ మాట్లాడుతూ – “ఆ ఆస్తిని నేను తీసుకోలేను. అది ఆమె కుటుంబానికి చెందాల్సింది. కాబట్టి వెంటనే ఆ ఆస్తిని తిరిగి వారి కుటుంబానికి ఇచ్చేశాను” అని తెలిపారు. అభిమానులపై తనకు గల గౌరవం, విశ్వాసం ఈ నిర్ణయంలో ప్రధాన కారణమని ఆయన చెప్పారు.