Sceneary: ప్రొడ్యూసర్లకు గుడ్‌ న్యూస్‌.. సినిమా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ‘సినరీ’ సరికొత్త ఛాయిస్‌!

Sceneary

Sceneary: సినిమా, షార్ట్‌ఫిల్మ్‌, వెబ్‌సిరీస్‌ వంటి ప్రాజెక్టులను రూపొందించే నిర్మాతలు, దర్శకులు, మూవీ ప్రొఫెషనల్స్‌కు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంతో కీలకం. షూటింగ్‌ షెడ్యూల్స్‌, నటీనటులు, టెక్నికల్‌ టీమ్‌, కాల్‌షీట్లు, బడ్జెట్‌, ఖర్చులు, డాక్యుమెంట్స్‌.. ఇలా ఎన్నో అంశాలను ఒకేసారి సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఈ పనులను సులభతరం చేసేందుకు రూపొందించిన ఆల్‌ ఇన్‌ వన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ‘సినరీ’ (Sceneary)గా పరిచయం అవుతోంది. ‘సినరీ’ ద్వారా సినిమా లేదా ఇతర వీడియో ప్రాజెక్ట్‌ను క్రియేట్‌ చేసి.. అందులో నటీనటులు, సిబ్బందిని యాడ్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో ప్రతి ఒక్కరికీ వారి బాధ్యతలకు అనుగుణంగా రోల్‌ ఆధారిత యాక్సెస్‌ ఇవ్వొచ్చని, దీంతో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నారనే విషయంలో స్పష్టత ఉంటుందని వెల్లడించారు.

దీంతో షూటింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసే సమయంలో నటీనటులు, సిబ్బంది అందుబాటులో ఉన్న తేదీలను తెలుసుకోవడం కూడా సులభమవుతుందని అంటున్నారు. వారి క్యాలెండర్లను పరిశీలించి అందరి అందుబాటుకు అనుగుణంగా షూటింగ్‌ తేదీలను ప్లాన్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. షెడ్యూల్‌ ఫైనల్‌ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తులకు నోటిఫికేషన్లు పంపడంతో పాటు.. వారు షెడ్యూల్‌ను అంగీకరించారా లేదా అనే విషయాన్ని కూడా ట్రాక్‌ చేయవచ్చని పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో బడ్జెట్‌ కంట్రోల్‌ అత్యంత కీలకం. ‘సినరీ’లో ప్రాజెక్ట్‌ బడ్జెట్‌, షెడ్యూల్స్‌, ఖర్చులను ఒకే చోట ప్లాన్‌ చేసి ట్రాక్‌ చేసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. నిర్ణయించిన బడ్జెట్‌ లేదా ఖర్చుల పరిమితిని దాటినప్పుడు నోటిఫికేషన్ల ద్వారా మేకర్స్‌కి సమాచారం అందుతుందని వెల్లడించారు. దీంతో అనవసర ఖర్చులను గుర్తించి నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు.

షూటింగ్‌కు అవసరమైన కాల్‌షీట్లను కూడా ‘సినరీ’ ద్వారా రూపొందించి నటీనటులు, సిబ్బందితో నేరుగా షేర్‌ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. దీంతో ప్రత్యేకంగా కాల్‌షీట్లు తయారు చేసి ఒక్కొక్కరికి పంపాల్సిన అవసరం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత టీమ్‌కు త్వరగా చేరవేయవచ్చని, ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన చాట్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని టీమ్‌ సభ్యులకు అప్‌డేట్స్‌ షేర్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్‌ను క్లౌడ్‌లో స్టోర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉందని, అవసరమైన వ్యక్తులకు మాత్రమే డాక్యుమెంట్స్‌కు యాక్సెస్‌ కల్పించవచ్చని చెప్పారు. ‘సినరీ’లోని సోషల్‌ మాడ్యూల్‌ ద్వారా వివిధ ప్రాజెక్టులకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్లు, ఇతర టాలెంట్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని, పాత్ర లేదా బాధ్యతకు సరిపోయే వ్యక్తులను వెతకడంలో ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు.సినిమా, షార్ట్‌ఫిల్మ్‌, వెబ్‌సిరీస్‌ వంటి ప్రాజెక్టులను నిర్ణయించిన సమయంలో, బడ్జెట్‌లో పూర్తి చేయాలనుకునే మూవీ ప్రొఫెషనల్స్‌కు ‘సినరీ’ సమగ్ర ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌గా ఉపయోగపడనుందని చెబుతున్నారు. ప్రస్తుతం 60 రోజుల లాంచ్‌ స్పెషల్‌ ప్లాన్‌ అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ‘సినరీ’ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుకునే మూవీ ప్రొఫెషనల్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ప్రయత్నించవచ్చని వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.aits.sceneary&pcampaignid=web_share