Bhogi: రిస్కీ స్టంట్స్‌తో రెచ్చిపోతున్న శర్వానంద్! ‘భోగి’ నుంచి క్రేజీ అప్డేట్..

Bhogi

Bhogi: శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను తెరకెక్కిస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 20 రోజుల భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట.

ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో మైండ్ బ్లోయింగ్ మాసివ్ స్టంట్స్ ఉండబోతున్నాయని సమాచారం. ఇందుకోసం హీరో శర్వానంద్ గతంలో ఎన్నడూ లేని విధంగా డబుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారట. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో కంపోజ్ చేసిన అత్యంత రిస్కీ స్టంట్స్‌ను శర్వా డూప్ లేకుండా సొంతంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోందని టాక్. సంపత్ నంది మార్క్ ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని సమాచారం. ఈ క్లైమాక్స్ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కై హైకి చేరాయి.