Telusu Kada : సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Telusukada
Telusu Kada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రముఖ స్టైలిస్ట్–ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘మల్లికా గంధ’ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమా హైప్‌ను మరింత పెంచింది. ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్ధు జొన్నలగడ్డతో పాటు రాశి ఖన్నా చిరునవ్వుతో కనిపించగా, శ్రీనిధి శెట్టి దూరంగా చూస్తూ ఉండటం కథలో లవ్ ట్రైయాంగిల్ ఉందని సూచిస్తోంది. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా దీపావళికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.