Varanasi: ఊహించిన దానికంటే ముందే ‘వారణాసి’ రాక!

Varanasi

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ ఇయర్స్ దాటిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం జక్కన్న సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ, షూటింగ్‌ను శరవేగంగా పరిగెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగుతుందని చిత్ర యూనిట్ భావించింది.

Also Read :  G2: సరికొత్త మేకోవర్‌తో అడవి శేష్.. ఆ సినిమా కోసమే!

అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం 80 రోజుల్లోనే మొత్తం పూర్తి చేసుకోబోతోందని స్వయంగా రాజమౌళి వెల్లడించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జక్కన్న కెరీర్‌లోనే ఇంత తక్కువ రోజుల్లో ఒక భారీ విజువల్ వండర్‌ను కంప్లీట్ చేయడం ఇదే మొదటిసారి కాబోతోంది. రాజమౌళి పక్కా ప్లానింగ్, మేకింగ్ స్పీడ్ చూసి అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు సూపర్ స్టార్ అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంతర్జాతీయంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్పీడ్‌తో పనులు పూర్తి చేసుకుంటే అనుకున్న సమయం కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ షెడ్యూల్‌పై మేకర్స్ నుంచి మరింత స్పష్టత రానుంది.