Super Decision : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభానికి ముందు విడుదలైన తాజా ప్రోమో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఆడిషన్స్‌లో పాల్గొన్న ఒక అంధుడి పాట, అతని కష్టసాధ్యమైన జీవితం, ఆ వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మాటలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఆడిషన్స్‌లో సూర్య నటించిన గజినీ సినిమా పాట “ఒక మారు కలిసిన బంధం”ను ఆ అంధుడు అద్భుతంగా ఆలపించగా, జడ్జీలంతా షాక్ అయ్యారు. పాట ముగిసిన వెంటనే తమన్ అడిగిన ప్రశ్నకు.. “చిన్నప్పటి నుంచే చూపు లేదా?” .. ఆ కంటెస్టెంట్ ఇచ్చిన సమాధానం అందరినీ కదిలించింది. “పుట్టినప్పటి నుంచే గుడ్డివాడిని” అని చెప్పగానే, తమన్ హృదయం కరిగిపోయింది. వెంటనే కార్తీక్ వైపు తిరిగి.. “నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తాం” అని హామీ ఇవ్వడం, ఆ క్షణాన్నే మరింత ఎమోషనల్‌గా మార్చింది.
ఈ మాటలు విన్న ఆ అంధ కంటెస్టెంట్ కళ్లలో కన్నీటి జల్లు, హృదయంలో ఆశ వెలుగులు పుట్టాయి. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తమన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమన్ ఇలా సహాయం చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేకమందికి తన సొంత డబ్బుతో వైద్యం చేయించాడు. అంతేకాదు, ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద మెరిసిన సింగర్లను తన సినిమాల్లో పాడేలా అవకాశం కల్పిస్తూ, వారి కెరీర్‌కి బంగారు బాటలు వేస్తున్నాడు. ఉదాహరణకు, సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్లకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో పాట పాడే చాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఫైర్ స్ట్రామ్ పాటలో వారి గాత్రం వినిపించింది. కేవలం సంగీతం మాత్రమే కాదు, ఒక మనిషి జీవితంలో వెలుగుని నింపడానికి ముందుకు వచ్చిన తమన్, మరోసారి తన మ్యూజిక్‌తో పాటు మానవత్వంను కూడా నిరూపించుకున్నాడు. అందుకే అందరూ ఒకే మాట చెబుతున్నారు..













