Telusu Kada : ‘తెలుసు కదా’ మూవీ నుంచి మల్లికా గంధ లాంచ్

Telusu kada

 

Telusu Kada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. మల్లారెడ్డి విమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ సింగిల్ **‘మల్లికా గంధ’**ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకురాలు నీరజా కోన, హీరో-హీరోయిన్లు, మేకర్స్ కలిసి లాంచ్ చేశారు.

ప్రముఖ స్టైలిస్ట్ నుంచి దర్శకురాలిగా మారిన నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు థమన్ అందించిన ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ మ్యూజిక్ లవర్స్‌కి మ్యూజికల్ ట్రీట్‌గా నిలుస్తోంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

థమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌లో ప్రేమ భావోద్వేగాలు అద్భుతంగా మిళితమయ్యాయి. తంబురా, ఫ్లూట్ వంటి ట్రెడిషనల్ వాయిద్యాలను మోడర్న్ టచ్‌లో వినిపించడం సాంగ్‌కు కొత్త స్టైల్ ఇచ్చింది. సిడ్ శ్రీరామ్ వాయిస్ సాంగ్‌కి అదనపు బ్యూటీని తెచ్చింది. అతని వాయిస్‌లోని ఫీల్, ఇంటెన్సిటీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయి.

దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ VS కలయికలో ప్రతి ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్‌గా మారింది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా కెమిస్ట్రీ సాంగ్‌లో అద్భుతంగా ప్రతిబింబించింది. రొమాంటిక్ సీన్స్, జోష్ నింపే డ్యాన్స్ మూమెంట్స్ సాంగ్‌కి మరింత మ్యాజిక్‌ను జోడించాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్, షీతల్ శర్మ కాస్ట్యూమ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ‘తెలుసు కదా’ సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.