Kingdom : ‘కింగ్డమ్’ లీక్ సీన్.. నిర్మాత రియాక్షన్ ఇలా..!

Kingdom
Kingdom : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొన్నాళ్లుగా ఆశించిన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు విడుదల చేసినా, గత చిత్రాలు అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కింగ్డమ్’పై భారీగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ సినిమా పై అంచనాలను గణనీయంగా పెంచింది.

‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోలు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రారంభించగా, తాజాగా 20 శాతం అదనపు ఖర్చుతో మొత్తం వ్యయం 150 కోట్లకు చేరిందని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. సినిమా విడుదల వరకు ప్రమోషన్లు, సాంకేతిక పనులపై భారీగా పెట్టుబడి పెట్టుతున్నట్లు తెలిపారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కింద వరుసగా విజయవంతమైన సినిమాలను అందిస్తున్నారు. ఇప్పుడు ‘కింగ్డమ్’ను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు వేగవంతమై, ఇంటర్వ్యూలు, టీజర్లు సినిమా హైప్‌ను మరింత పెంచుతున్నాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన ‘జెర్సీ’లో రైల్వే సీన్‌తో చూపిన భావోద్వేగాన్ని గుర్తుంచుకున్న ప్రేక్షకులకు, ‘కింగ్డమ్’లో కూడా అలాంటి ఎమోషనల్ సన్నివేశం ఉందని నిర్మాత నాగ వంశీ చెప్పారు. “శ్రీలంకలో ఇద్దరు అన్నదమ్ములు కలిసే సీన్‌లో ఉండే ఎమోషన్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఇది సినిమా హైలైట్ అవుతుంది,” అని ఆయన హామీ ఇచ్చారు.