150 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఏలూరు గంగానమ్మ ఆంథెమ్ విడుదల!

Ganganamma song
ఏలూరు గ్రామ దేవత, భక్తుల ఇలవేల్పు శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని చాటిచెబుతూ రూపొందించిన **‘ఏలూరు గంగానమ్మ ఆంథెమ్’** మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ జాతరపై తొలిసారిగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ భక్తి గీతాన్ని తరంగిణి ఒరిజినల్స్, గంగానమ్మ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతరకు ఉన్నట్లుగా, ఏలూరు గంగానమ్మ జాతర వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ ప్రత్యేక గీతాన్ని సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించి చిత్ర బృందాన్ని అభినందించారు.

తరంగిణి ఒరిజినల్స్, గంగానమ్మ పిక్చర్స్ బ్యానర్లపై సత్యవతి మోటేపల్లి, దారపు ఛాయాదేవి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా, మల్లిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సాయి తేజ మోటేపల్లి దర్శకత్వం వహించగా, వంశీ మోటేపల్లి ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ గాయకుడు ధనుంజయ్ సీపాన తన గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సత్య కశ్యప్ సంగీతం, యువ కిరణ్ సాహిత్యం అందించారు. మేకల కల్యాణ్ నాయుడు, నవ్య, గంగ, దేవాన్షి కీలక పాత్రల్లో నటించగా, శ్రీయ బెందాడి గంగానమ్మ తల్లి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. మేకల నాగేంద్ర ఎడిటింగ్, పోస్టర్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వహించగా, అసోసియేట్ డైరెక్టర్‌గా నాగి రెడ్డి, కొరియోగ్రాఫర్‌గా సాగర్ వేలూరు పనిచేశారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో లోయ సాయి, మాగంటి ఏడుకొండలు, తుంగ జయంత్ తమ సహకారం అందించారు.

ఏలూరు ప్రాంతీయ సంస్కృతి, జాతర వైభవం, అమ్మవారి భక్తి పారవశ్యాన్ని అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరించిన ఈ మ్యూజిక్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా గంగానమ్మ తల్లి పాత్ర చిత్రణ, పాటలోని ఉత్సాహభరితమైన సంగీతం, సాహిత్యం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. విడుదలైనప్పటి నుంచి ఈ గీతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారుతోంది. ఏలూరు గంగానమ్మ జాతర చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్న ఈ తొలి ఆంథెమ్ పూర్తి వీడియోను తరంగిణి ఒరిజినల్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.