రివ్యూ : ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra king taluka review
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా రూపొందిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 27, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. *“ఫ్యాన్ బయోపిక్”*గా ప్రచారం కావడంతో సినిమా మీద ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించటం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు మహేష్ బాబు పచిగొల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో, రామ్‌కు ఇది రీఎంట్రీ హిట్ అయ్యే అవకాశముందనే నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. చార్ట్‌బస్టర్ పాటలు, ఆసక్తికరమైన ట్రైలర్‌తో ఇప్పటికే బాగానే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం మరింత హైప్ తీసుకువచ్చింది. రామ్‌కు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ రాకపోవడంతో, ఈ సినిమా అతడి కెరీర్‌కి కీలక మలుపు అవుతుందా? భాగ్యశ్రీ బోర్సేకి ఇది మంచి బ్రేక్ అవుతుందా? ఉపేంద్ర పాత్ర ఎంతవరకు సినిమాకి బలం చేకూర్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే.

Also Read :  YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

కథలో ‘ఆంధ్ర కింగ్’ అనే బిరుదుతో ఉన్న సూపర్‌స్టార్ సూర్య (ఉపేంద్ర) 100వ సినిమా ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఆగిపోతుంది. అనూహ్యంగా సాగర్ (రామ్) అనే అభిమాని తన అకౌంట్‌లో మూడు కోట్లు జమ చేశాడని తెలుసుకున్న సూర్య, ఆ యువకుడు ఎవరు, ఎందుకు సహాయం చేశాడు అన్న విషయంలో ఆసక్తి పెంచుకుంటాడు. సాగర్ నిజంగా ఎవరు? అతనికి అంత డబ్బు ఎక్కడిదొచ్చింది? అతని ప్రేమలోని సమస్యలు ఏమిటి? ఈ ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.

గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగిన కథనం ప్రేక్షకులను పట్టేస్తుంది. రామ్‌ పాత్రలో కనిపించిన సంఘర్షణలు, ఉపేంద్రతో సాగిన ఎమోషనల్ ట్రాక్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా పనిచేశాయి. ఫస్ట్ హాఫ్ కొంత మందకొడిగా సాగినా, సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో చూపించిన భావోద్వేగాలు చాలా మందిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. రియాలిటీకి సరిపోలని పాయింట్లు ఉన్నా, సినిమాటిక్ లిబర్టీతో కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్ పూర్తి స్థాయిలో పనిచేసి ఉంటే సినిమా రేంజ్ ఇంకొంచెం పెరిగేది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటుల విషయానికి వస్తే రామ్ పూర్తిగా సినిమా భుజాలపై మోశాడు. ఉపేంద్ర తక్కువ స్క్రీన్‌టైమ్‌ తక్కువగా ఉన్నా తన రోల్ లో అద్బుతంగా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే పరిమిత పాత్రలోనూ పరలేదనిపించింది. మురళీ శర్మ, రావు రమేష్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బీజీఎం సినిమాకి ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. మహేష్ బాబు దర్శకత్వం కథను నమ్మకంగా ముందుకు నెట్టగా, నిడివిలో ఇంకా కాస్త కట్టుదిట్టం చేసుంటే బాగుండేది.

మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5