ఏప్రిల్ 10 న మారుతీ – ప్రభాస్ మూవీ ఓపెనింగ్..

రాధే శ్యామ్ మూవీ తో భారీ ప్లాప్ అందుకున్న ప్రభాస్..కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఏప్రిల్ 10 న ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు జరపబోతున్నట్లు సమాచారం. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. దీనికి ‘రాజాడీలక్స్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు భామలు నటించబోతున్నారట.

మారుతి తరహా ఎంటర్ టైన్‌మెంట్ ఉంటూనే ప్రభాస్ స్థాయికి తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. మారుతి ఇంతవరకు ఒక్క వెంకటేశ్ తో తప్ప వేరే పెద్ద హీరోలతో సినిమానే చేయలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తోనే సినిమా చేస్తుండడం విశేషాన్ని సంతరించుకుంది.