బాబు ఎత్తుల ముందు విప‌క్షాలు చిత్తు

రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు అనేవి ఇప్పటివి కావు..ఎప్పటి నుండో వస్తున్నదే..అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలు వేస్తే..వారి ఎత్తుగడల ఫై ఫైఎత్తుగడలు అధికార పార్టీలు వేయడం చేస్తుంటారు..అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లు అధికార పార్టీ ఫై ఎత్తుగడలు వేయలేక చిత్తూ అవుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం చూసి ఎత్తుగడలు వేయడంలో సమర్ధుడు. ఇది ఇప్పటిది కాదు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుండి ఆయన ముఖ్యమంత్రి గా పదవి చేసే సమయం నుండి చేస్తున్నదే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం నావే అని చెప్పడంలో బాబు తర్వాతే ఎవరైనా..

ప్రస్తుతం ఆయన అదే చేస్తున్నాడు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో బాబు ప్రజల పట్ల అమిత ప్రేమను కురిపిస్తూ రకరకాల సంక్షేమ పథకాలను బయటకు తీస్తూ జనాల్లో మార్కులు కొట్టేస్తున్నాడు. వాస్తవానికి ఈ పథకాలన్నీ కేంద్ర పథకాలే..కానీ బాబు మాత్రం అవే నావే అని చెపుతున్నాడు. బాబు ఇంత చెపుతున్న కానీ జగన్ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు..బాబు ఎత్తుగడల ఫై ఫై ఎత్తుగడలు వెయ్యకుండా సైలెంట్ ఉన్నాడు. ఎంత సేపు ఒంటరి పోరాటమే చేస్తున్నాడు తప్ప బాబు చేసే మోస పూరిత ప్రకటనల ఫై స్పందించడం కానీ..ఆ పథకాలు కేంద్ర పథకాలని, బాబు చేసిందే ఏమి లేదని ప్రజలకు చెప్పడం లో విఫలం అవుతున్నాడు. జగన్ సైలెంట్ అవడం బాబు కు మరింత కలిసివస్తుంది. ఇకనైనా జగన్ మౌనం విడి బాబు ఎత్తుగడలకు ఫై ఎత్తుగడలు వేస్తాడా ..లేదా అనేది చూడాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.