తెలుగుదేశంకి సానుకూల‌త‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం పార్టీ కి ఓటమి తప్పదని అన్ని సర్వేలు తేల్చి చెపుతున్న వేళా..
రూరల్ మీడియా అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో తెలుగుదేశం పార్టీ సానుకూల‌త‌లు..వ్యతిరేకతలు మొదలగున్నవి తెలియజేసింది.

వీరు చెప్పిన సర్వే ప్రకారం..

* ప్రజల్లో ‘చంద్రన్నబీమా’ పథకం పట్ల అద్భుతమైన స్పందన వస్తుంది.

* బైక్‌ ఆంబులెన్స్‌లను ఐటీడీఏ ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌ ఆంబులెన్స్‌ల వల్ల ప్రాణాలు కాపాడుకున్నామని” సీతంపేట, పాడేరు ఏజెన్సీలలో సవర గిరిజన కుటుంబాలు చెప్పినట్లు ఈ సర్వేలో చెప్పరు.

* ‘పసుపు కుంకుమ’ పథకం కూడా గ్రామీణ మహిళలను బాగా ఆకట్టుకుంది.

* ‘ఎన్టీఆర్‌ జలసిరుల’ పథకంలో సోలార్‌ బోర్లు సబ్సిడీలో ఇవ్వడం కూడా, ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పధం పెరిగింది.

* పేద మహిళలకు మరుగుదొడ్డి మొదలగు ప్రభుత్వ పథకాలపై మంచి స్పందన ఉన్నట్లు తెలిపారు.

* ప్రభుత్వ వ్యతిరేక అంశాలు విషయానికి వస్తే..

* టీడీపీ,జనసేన పార్టీ నాయకులు ‘ఆంధ్రా వాళ్లను తెలంగాణా లో కొడుతున్నారు …” అని పదే పదే ప్రచారం చేయడం వల్ల, రాజకీయ స్వార్దం కోసం ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు పెంచుతున్నారనే భావన ఏర్పడింది.

* పార్వతీపురం, అరకు మన్యం ప్రాంతంలో ప్రాధమిక వైద్య సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం టూవీలర్‌ వెళ్లడానికి కూడా రహదారుల లేని గిరిజన పల్లెలు అనేకం ఉన్నాయి.

* రహదారుల నిర్మాణంలో ఐటీడీఏ పూర్తిగా విఫలం అయిందని అడవి బిడ్డలంటున్నారు.

*రాష్ట్రంలో విద్యుత్‌ లేని కుగ్రామాల సంఖ్య రెండు వందలకు పైగా ఉన్నట్టు సర్వే లో తెలిసింది.

* రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.

* వృద్దులు,వికలాంగులు, రైతులకు అందాల్సిన కొన్ని పథకాలలో జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువగా ఉందని, దానివల్ల లబ్దదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాదాపు అన్ని ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న ఆరోపణ.

* రాష్ట్రవ్యాప్తంగా 87వేల కోట్లకు పైగా, రైతు రుణాలున్నాయి. వీటిలో 24వేల కోట్ల రుణాల్ని మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగతా 63వేల కోట్ల రుణాల సంగతేంటి? ఐదేళ్లలో విడతలవారీగా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పిన టీడీపీ సర్కారు ఆ అంశాన్ని పట్టించుకోక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సర్వే ఫై ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.