దేశంలో దొంగల లెక్కలు ఇవి !

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ విషయంలో కేంద్రంతో మమతా బెనర్జీ చేస్తున్నపోరాటం ఫై అందరూ తెగ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా అసలు కేసులను బయటపెట్టింది. ఈ కేసులను ఎవరు పెట్టారు..? ఎప్పుడు పెట్టారు..? ఎవరెవరి ఫై పెట్టారు..? ఏ ఏ ఇయర్ లో పెట్టారు..అనేది తెలిపింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే వీరు తెలిపిన కేసులన్నీ కాంగ్రెస్ అయాం లో పెట్టిన కేసులే కావడం.

ఇక వీరు ప్రకటించిన కేసుల తాలూకా వ్యక్తులలో మోడీ , అమిత్ షాలు కూడా ఉన్నారు. కాకపోతే వీరి ఫై ఉన్న కేసులను కోర్ట్ కొట్టివేసింది. అయినాగానీ వారిపై ఇంకా కేసులు నడుస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కి సంబందించిన మీడియా వారు ప్రచారం చేస్తున్నారు. ఇది కావాలనే వారిపై బురద చల్లేందుకే చేస్తున్నట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది.

కేసుల తాలూకా వ్యక్తులను చూస్తే..

మాయావతి ఈమె ఫై 2007 లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే మమతా బెనర్జీ ఫై 2013 లో పెట్టిన కేసు, అరవింద్ క్రేజీవాల్ ఫై 2018 లో కేసు , కేరళ సీఎం విజయన్ 2006 లో పెట్టిన కేసు , చంద్రబాబు ఫై బాబ్లీ ప్రాజెక్ట్ కేసు , నోటు కు ఓటు కేసు వీరే కాక మరికొంతమంది వ్యక్తుల ఫై ఉన్న కేసులను ప్రచారం చేసింది.

వీరి ప్రచారం చేసిన దాని బట్టి చూస్తే కోర్ట్ ఆదేశాల మేరకే కదా వీరి ఫై కేసులు నడుస్తుంది..అలాంటప్పుడు జగన్ ఫై కూడా కోర్ట్ ఆదేశాల ప్రకారమే కేసు నడుస్తుంది.. మరి తెలుగుదేశ ప్రతికూల మీడియా వారినందరిని పదే పదే చెప్పకుండా ఎంత సేపు జగన్ ఒక్కడే దోషి అన్నట్లు చెప్పడం , ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.