జ‌గ‌న్ అభిమానుల న‌మ్మ‌కం గెలుచుకున్న బాబు..

వై.ఎస్. జగన్ అభిమానులకు , వైస్సార్సీపీ కార్య కర్తలకు కొత్త అనుమానాలు మొదలు అవుతున్నాయా..? ఓ పక్క 2019 ఎన్నికల్లో జగనే సీఎం అవుతాడని చెపుతూనే..మరోపక్క అవుతాడా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా..? బాబు ను ఎంతమంత్రం నమ్మకూడదని అనుకుంటున్నారా..? చివర్లో ఏదయినా జరగవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా..? అనేది ఇప్పుడు చర్చగా మారింది.

జగన్ వెంట ఉంటూ..జగన్ ఏ సభ పెట్టిన ఆ సభకు భారీ ఎత్తున హాజరవుతూ..ఆయన తో పాటే నడుస్తూ..మీరే నెక్స్ట్ సీఎం అంటూనే అనేక అనుమానాలు తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం చంద్రబాబు..ఏ సమయంలో ఏ గొడుగు పట్టాలో బాబు కు తెలిసినంత జగన్ కు తెలియదు..గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలే..ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తూ జనాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

మొన్నటి వరకు ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపని బాబు కరెక్ట్ గా ఎన్నికల సమయాల్లో ప్రత్యేక హోదా అంటూ నానా హడావిడి చేస్తున్నాడు. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ జనాల్లో ఆదరణ పొందుతున్నాడు. బాబు చేసే ఈ పనుల వల్ల జగన్ అభిమానుల్లో , వైస్సార్సీపీ కార్య కర్తల్లో కొత్త భయం మొదలు అయ్యిందట. వారిలో ఆ భయాన్ని నింపడంలో చంద్రబాబు విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.