జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌పై వేటు అంత ఈజీ కాదు

జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌పై వేటు వేసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తుందా..? శాసన సభ స్పీకర్ ద్వారా ఎమ్మెల్యేల‌పై చర్య తీసుకోవాలని చూస్తుందా..ఇది సాధ్యమా..అంటే కాదనే చెపుతున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం శాసన సభ సమావేశాల్లో వైస్సార్సీపీ పార్టీ నేతలు ఎవరు హాజరు కావడం లేదనే సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సభకు హాజరుకాని ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నాడు. కానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో నందమూరి తారకరామారావు కాంగ్రెస్ పార్టీ ఫై కోపం తో సభకు హాజరుకాలేదు. అలాగని వారు ఎన్టీఆర్ ఫై ఎలాంటి చర్యలు తీసుకోలేదు..రాజకీయాల్లో రాజకీయం వేరు , చర్యలు వేరు. స్పీకర్ కు అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది..అలాగని ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు.

గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలే అమల్లోకి వస్తుంటాయి. కానీ ఈ మధ్య స్పీకర్ నిర్ణయాలు తప్పుదోవ పడుతున్నాయి..కొన్ని సంఘటనలు అలాగే జరిగాయి. ఇక ఇప్పుడు వైస్సార్సీపీ ని అణగదొక్కేందుకు కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

వైసీపీ పార్టీ ని ఇరకాటం లో పెట్టేందుకు ఆ ఎమ్మెల్యే ల పై చర్యలు తీసుకునేందుకు శాసన సభ తీర్మానం పెట్టబోతున్నారు. అదేలా అంటే సభ కు రావడం లేదు కాబట్టి వారిపై అనర్హత వేట వేయడం లేదా..వారి జీతాలు కట్ చేయడం వంటి చర్యలు తీసుకోబోతుంది. ఒకవేళ జీతాలు ఆపితే వారికీ గుణపాఠంలా అవుతుందని భావిస్తున్నారు. కానీ ఆలా ఆపడం కూడా ఓ చర్చ కు దారి తీస్తుంది. ఓవరాల్ గా వైస్సార్సీపీ మ్మెల్యే ల ఫై ఎలాంటి చర్యలు తీసుకున్న వారికే ఇబ్బంది ఏర్పడుతుంది. మరి ఇబ్బందులు చూసుకొని వారి నిర్ణయాలు మార్చుకుంటారా.? లేక ఇబ్బందులు వచ్చిన వాటిని లెక్క చేయరా..అనేది చూడాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.