సామాన్యుల‌ను అంద‌లం ఎక్కించిన ప‌వ‌న్‌

రాజకీయం అంటే ధనవంతులదేనా..సామాన్యప్రజలు రాజకీయ నేతలు కాలేరా..ఎప్పుడు ఒకే నాయకులు పరిపాలన చేస్తారా..వారి చెప్పు చేతుల్లోనే ప్రజలు బ్రతకాల..రాజకీయాల్లో కొత్త మార్పు రాదా..అంటే అదేం లేదు అంటున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సామాన్యుల‌ను అంద‌లం ఎక్కించేందుకే జనసేన పార్టీ అని పవన్ చెప్పుకొస్తున్నాడు.

జనసేన పార్టీ లో సామాన్యులకే చోటు..

ప్రస్తుత రాజకీయాల్లో ఏ అభ్యర్ధికి సీటు ఇవ్వాలన్న ఆ నిర్ణయం పార్టీ అధినేత తీసుకుంటాడు..అది తెలుగుదేశం పార్టీ అయినా , లేదా వైస్సార్సీపీ పార్టీ అయిన..కానీ జనసేన పార్టీ మాత్రం ఆలా కాదు స్క్రీనింగ్ పద్ధతి కి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఈ స్క్రీనింగ్ కమిట్ లో కూడా వివిధ రంగాలకు చెందిన వారిని , సామాన్య స్థాయి నుండి ఎదిగిన వారిని ఎంపిక చేసారు. వీరు నిరుపేద ప్రజలకు దగ్గర ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ నిత్యం వారి బాధలు తెలుసుకున్న వారిని ఈ స్క్రీనింగ్ కమిట్ లో తీసుకోవడం జరిగింది.

* వారు ఎవరు అంటే..

హరిప్రసాద్ , మాదాస్ గంగాధర్ , అర్హం ఖాన్ , మహేంద్ర రెడ్డి , తమ్మిరెడ్డి శివ శంకర్ ఇలా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు.

* వీరు అంత ఏంచేస్తారు అంటే ..

అభ్యర్థి దగ్గర ఎంత గెలిచే సత్తా ఉంది..? ప్రజలను ఆకర్షించే టాలెంట్ ఎంత ఉంది..? ప్రజల సమస్యల పట్ల ఎంత అవగాహన ఉంది..? ప్రత్యర్థి ని ఎదురుకునే బలం ఎంత ఉందనేది వీరు చూసి ఎంపిక చేస్తారు.

ఆలా ఎంపిక చేసిన వారిలో మూడు రకాల సర్వే చేస్తారు..

* అభ్యర్థుల బల బలాల మీద సర్వే చేస్తుంది..
* వ్యక్తిగత బల బలాలు..
* గెలువల గల సత్తా ఎంత ఉంది..
* ఎన్నికల్లో ఎదురుకునే సత్తా ఎంత ఉంది..
* ప్రజా సేవలో చిత్తశుద్ధి ఎంత అనేది కమిటీ చూస్తారు.

అక్కడి కమిటీ ఓకే చేసి జనసేన జనరల్ బాడీ కి అభ్యర్థి రిపోర్ట్ ను సమర్పిస్తారు. అప్పుడు వారు అభ్యర్థి అర్హుడైన కదా అనేది నిర్ణయిస్తారు..అర్హుడితే ఓకే..కాకపోతే ఎందుకు కాడు అనేది తెలుపుతారు.

ఇలా చేయడం రాజకీయాల్లో కొత్త మార్పు తెస్తుందని చెప్పాలి..ఎందుకంటే సామాన్య ప్రజలకు ఏం కావాలో వారికీ తెలుస్తాయి కాబట్టి ఆలా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి జనసేన అధినేత చేసే ఈ సరికొత్త శ్రీకారం సక్సెస్ కావాలని జనసేన కార్య కర్తలు కోరుకుంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.