శభాష్ కేసీఆర్ !

పశ్చిమ బెంగాల్‌లో శారద చిట్ ఫండ్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు సీబీఐ, కోల్‌కతా పోలీసులు మధ్య హైడ్రామాకు దారి తీసిన నేపథ్యంలో కేంద్ర తీరును నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నాకు దిగడం , రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం వంటివి మమతా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమెకు మద్దతుగా కొన్ని పార్టీలు సైతం ఢిల్లీకి వెళ్లడం జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మమతాకు తమ మద్దతు తెలిపాడు. ఇది మోడీ ఫై కోపంతోనే అనుకోవచ్చు.

అయితే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అందరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరికి తెలుసు..అవసమైతే కాళ్లు పట్టుకుంటుంది..అవసరం తీరక జుట్టు పట్టుకునే రకం.. అవకాశవాద రాజకీయాలు చేయడం లో మమతా దిట్ట. ఇది గ్రహించే కేసీఆర్ ఆమె ధర్నా పట్ల కానీ..ఆమె చేస్తున్న దీక్ష పట్ల గాని ఎలాంటి సమాధానం తెలుపకుండా..సైలెంట్ గా ఉండి అందరి దృష్టి లో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒకవేళ మమతా కు కేసీఆర్ మద్దతు తెలిపితే చాలామంది లో నెగిటివ్ సంకేతాలు వెళ్లేవి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.