తండ్రి బాధ్యత తీసుకున్న లోకేష్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియడం తో ప్రధాన పార్టీలన్నీ ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడినా వారితో మాట్లాడం..కలవడం..వారితో ఫొటోస్ దిగడం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన నెక్స్ట్ డే నే గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఉన్న దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి నిత్యాన్నదానం కోసం పవన్‌ రూ.1.32కోట్లు చెక్కును విరాళంగా ధర్మకర్తలకు అందజేశారు. ఆ తర్వాత ఆలయంలో అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత ఆయన పనుల్లో ఆయన బిజీ అయ్యారు.

ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ ను కలవడం..ఆయనతో ముచ్చటించడం..స్టాఫ్ తో ఫొటోస్ దిగడం..ఇన్ని రోజులు కష్టపడినందుకు థాంక్స్ చెప్పడం వంటివి చేసారు. వాస్తవానికి ఇలాంటివి చేయడం లో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. టీడీపీ ఏ సభ చేప్పట్టిన..ఏ దీక్ష చేపట్టిన కానీ దానికోసం కష్టపడిన నేతలను పిలిపించుకోవడం..వారితో మాట్లాడం కలిసి భోజనం చేయడం వంటివి బాబు చేస్తాడు. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు పూర్తికాగానే ఢిల్లీ బాట పట్టాడు. దీంతో టీడీపీ నేతల్లో , కార్య కర్తల్లో ఈసారి పిలుపు రాదా అని భావించారు. కానీ ఈసారి బాబు బాధ్యత లోకేష్ తీసుకున్నాడు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరిని కలుసుకొని వారితో భోజనం చేసి..గెలుపు మనదే అంటూ వారిలో ఉత్సహం నింపడం చేసాడట.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.